ఏనుగును రహస్యంగా పూడ్చిపెట్టిన వ్యక్తి కోసం..

ABN , First Publish Date - 2020-03-04T15:51:22+05:30 IST

ఏనుగును రహస్యంగా పూడ్చిపెట్టిన వ్యక్తి కోసం..

ఏనుగును రహస్యంగా పూడ్చిపెట్టిన వ్యక్తి కోసం..

తమిళనాడు, వేలూరు: వేలూరు జిల్లా గుడి యాత్తం సమీపంలోని విద్యుత్‌ కంచెకు చిక్కి ప్రాణాలు కోల్పోయిన ఏనుగును ఎవరికీ తెలియ కుండా పూడ్చిపెట్టి, ఆపై అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మత్తేట్టిపల్లి గ్రామంలో పిచ్చాండి అనే వ్యక్తి కొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉండడంతో ఏనుగు లు పొలాల్లోకి చొరబడి పంటలను నాశనం చేసే సంఘటనలు తరచూ జరిగేవి. దీనిని అడ్డుకునేం దుకు పిచ్చాండి పొలం చుట్టూ విద్యుత్‌ కంచె ఏర్పాటుచేశాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఒక మగ ఏనుగు విద్యుత్‌ కంచెలో చిక్కుకుని మరణించింది. దీంతో అతను ఆ ఏనుగుని అదే స్థలంలో పూడ్చిపెట్టేశాడు. ఈ విషయం తెలుసు కున్న అటవీశాఖ అధికారులు, వెటర్నరీ వైద్యులు అక్కడకు వెళ్లి మట్టిని తవ్వి ఏనుగు కళేబరాన్ని వెలికితీసి, పోస్టుమార్టం జరిపారు. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పిచ్చాండి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Updated Date - 2020-03-04T15:51:22+05:30 IST