పట్టపగలు నాటుబాంబు కలకలం

ABN , First Publish Date - 2020-03-04T15:31:12+05:30 IST

పట్టపగలు నాటుబాంబు కలకలం

పట్టపగలు నాటుబాంబు కలకలం

చెన్నై నడిబొడ్డున పట్టపగలు నాటుబాంబు కలకలం 


చెన్నై, (ఆంధ్రజ్యోతి): చెన్నైలోని ప్రధాన ప్రాంతాల్లో ఒకటైన తేనాంపేటలో పట్టపగలు దుండగులు నాటుబాంబు విరిసి పరారయ్యారు. పెద్ద శబ్ధంతో పేలిన ఆ బాంబు కారణంగా ఎటువంటి ప్రాణనష్టంగానీ, గాయపడడంగానీ జరుగకపోయినా.. పోలీసు స్టేషన్‌కు అత్యంత సమీపంలో సంభవించిన ఈ ఘటన స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది. మోటాక్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తేనాంపేటలోని కామరాజర్‌ అరంగం వద్ద నాటుబాంబు విసిరి పారి పోయారు. దీంతో అక్కడున్న ఒక కారు అద్దాలు పగి లాయి. అలాగే పక్కనే ఉన్న కారు షోరూమ్‌ అద్దాలు కూడా స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలికి అత్యంత సమీపంలోనే తేనాంపేట పోలీసు ఉండడంతో హుటాహుటిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. పేలింది నాటు బాంబేనని నిర్ధారించారు. ఆ వెంటనే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా.. జెమినీ ఫ్లై ఓవర్‌ నుంచి నందనం వైపు వెళ్తూ బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుకి అటువైపుకి నాటుబాంబు విసిరి వేగంగా వెళ్లిపోయారు. అయితే అటువైపు ఉన్న ఎవరి మీదో బాంబు వేయాలని ఆ దుండగులు ప్రయ త్నించగా, అది గురి తప్పినట్లుగా పోలీసులు భావిస్తు న్నారు. విచారణలో భాగంగా ఫోరెన్సిక్‌ నిపుణులు కూడా ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలోపు చెన్నై పోలీసు కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ కూడా ఘటనా స్థలికి చేరుకుని విచారణ జరిపారు. ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉండే జెమినీ ఫ్లైఓవర్‌ వద్ద నాటుబాంబు పేలిన సంఘటనతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.  అంతేకాదు, ఆ పక్కనే అమెరికా రాయబార కార్యాలయం ఉండడంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మొహరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బాంబు విసిరిన దుండగులను గుర్తించి, అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2020-03-04T15:31:12+05:30 IST