మహిళకు అసభ్య చిత్రాల పోస్ట్‌.. యువకుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-08-18T14:25:17+05:30 IST

మహిళకు అసభ్య చిత్రాల పోస్ట్‌.. యువకుడి అరెస్టు

మహిళకు అసభ్య చిత్రాల పోస్ట్‌.. యువకుడి అరెస్టు

చెన్నై: మైలాడుదురై ప్రాంతంలో ఓ మహిళకు వాట్సాప్‌ ద్వారా అసభ్య చిత్రాలు పోస్ట్‌ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మైలాడుదురై జిల్లా తరగంబాడి సమీపం అగరవల్లం ప్రాంతానికి చెందిన అఫ్రిత్‌ అదే ప్రాంతంలో సెల్‌ఫోన్‌ రీఛార్జీ దుకాణం నడుపుతున్నాడు. సోమవారం ఉదయం దుకాణానికి వచ్చి.. ఓ మహిళ సెల్‌ఫోన్‌ రీఛార్జీ చేయించుకుంది. ఆ నెంబరును నోట్‌చేసుకున్న అఫ్రిత్‌ వాట్సాప్‌ ద్వారా ఆమెకు అశ్లీల చిత్రాలు పంపించాడు. ఈ విషయమై బాధిత మహిళ ఫిర్యాదుతో మహిళల వేధింపుల చట్టం కింద పోలీసులు అఫ్రిత్‌ను అరెస్టు చేశారు.

Updated Date - 2020-08-18T14:25:17+05:30 IST