మెట్టు దిగిన ఓపీఎస్‌.. ఛాన్స్‌ కొట్టేసిన ఈపీఎస్‌

ABN , First Publish Date - 2020-10-07T13:34:38+05:30 IST

సీఎం అభ్యర్థి నిర్ణయంపై అన్నాడీఎంకేలో చెలరేగిన వివాదం ఎట్టకేలకు సమసిపోయింది. పార్టీ ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి, సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి

మెట్టు దిగిన ఓపీఎస్‌.. ఛాన్స్‌ కొట్టేసిన ఈపీఎస్‌

చెన్నై : సీఎం అభ్యర్థి నిర్ణయంపై అన్నాడీఎంకేలో చెలరేగిన వివాదం ఎట్టకేలకు సమసిపోయింది. పార్టీ ఉప సమన్వయకర్త, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి, సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం మధ్య తలెత్తిన విభేదాలు సీని యర్‌ మంత్రులు, పార్టీ నేతల రాజీ యత్నాలతో సద్దుమణిగాయి. సీఎం అభ్యర్థిగా తననే ప్రకటిం చాలని బెట్టుచేసిన పన్నీర్‌సెల్వం పట్టుసడలిం చారు. దీంతో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి చాన్స్‌ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికే దక్కనుంది. ఇక బుధవారం ఇద్దరూ కలిసి సీఎం అభ్యర్థి ఎంపికపై అధికారికంగా ప్రకటించను న్నారు. సీఎం అభ్యర్థి ఎంపిక విషయమై సెప్టెంబర్‌ 28 అన్నాడీఎంకే కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం వాగ్వాదానికి దిగడంతో ఆ పార్టీలో తీవ్ర కలకలం బయల్దేరింది. ఇద్దరు నేతలు సీఎం ఛాన్స్‌కోసం తగవులాడుకోవడంతో పార్టీ సీని యర్‌ నేతలు, మంత్రులు దిగ్ర్భాంతి చెందారు. దీని తర్వాత పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి ఎడప్పాడికి దూరమయ్యారు. కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు గైర్హాజర య్యారు. ఇలా అలకపాన్పు వహించిన ఓపీఎస్‌ను బుజ్జగించేం దుకు సీనియర్‌ మంత్రులు ఆయన నివాసంలో పలు విడతలుగా చర్చలు జరిపారు. ఆ తర్వాత పన్నీర్‌సెల్వం తన స్వస్థలమైన పెరియకుళం వెళ్ళి కైలాసపట్టి ఫామ్‌హౌస్‌లో తన మద్దతుదారులతో మూడువిడతలుగా మంతనా లు కూడా జరిపారు. ఆదివారం చెన్నై తిరిగొచ్చి న పన్నీర్‌సెల్వం పార్టీ శ్రేణుల అభిప్రాయాలకు అనుగుణంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ట్విట్టర్‌లో సందేశం వెలువరించారు.


ఓపీఎస్‌తో మంతనాలు...

ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఆదివారం రాత్రి చెన్నై చేరగానే ఆయనతో సీనియర్‌ నేతలు మంతనాలు సాగించారు. అన్నాడీఎంకే వ్యవ స్థాపక కార్యదర్శి నత్తం విశ్వనాధన్‌ తదితరులు పన్నీర్‌సెల్వంను కలుసుకుని సీఎం అభ్యర్థి ఎంపిక విషయమై పట్టుసడలించి పార్టీ భవిష్యత్‌ను కాపాడాలని కోరారు. సోమవారం ఉదయం మంత్రులు జయకుమార్‌, ఆర్బీ ఉదయకుమార్‌, ఎస్పీవేలుమణి, తంగమణి, అన్నాడీఎంకే డిప్యూటీ సమన్వయకర్త కేపీ మునుసామి, వైద్యలింగం, మనోజ్‌పాండియన్‌ తదితరులు పన్నీర్‌సెల్వం నివాసానికి వెళ్ళారు. గంటకు పైగా ఓపీఎస్‌తో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి పళనిస్వామినే బుధవారం సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు సహకరించాలని, అందుకు ప్రతిగా పన్నీర్‌సెల్వం కోరుతున్నట్లు 11 మందితో మార్గదర్శక కమిటీని ఏర్పాటు చేయిస్తామని మంత్రులు భరోసా ఇచ్చారు. మంత్రుల రాయబారంతో పన్నీర్‌సెల్వం తన పట్టు సడలించారు. బుధవారం సీఎం అభ్యర్థిపై ప్రకటన చేసేటప్పుడే మార్గదర్శక కమిటీ ఏర్పాటు గురించి కూడా ప్రకటన చేయాలని పన్నీర్‌సెల్వం డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత మంత్రులు పన్నీర్‌సెల్వంతో జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి తెలియజేశారు. మార్గదర్శక కమిటీలో ఎడప్పాడి వర్గానికి చెందిన ఐదుగురు, పన్నీర్‌సెల్వం వర్గానికి చెందిన ఐదుగురు సభ్యులుగా ఉంటారు. ఏ వర్గానికి చెందని తటస్థంగా ఉండే సీనియర్‌ నాయకుడిని మరో సభ్యుడిగా నియమించనున్నారు. ఈ కమిటీ ఏర్పాటుకు సంబంధించి కూడా బుధవారం అధికారికంగా ప్రకటన రానుంది. ఈ విషయాన్ని అన్నాడీఎంకే డీప్యూటీ సమన్వయకర్తల కేపీ మునుసామి ప్రకటించారు.

Updated Date - 2020-10-07T13:34:38+05:30 IST