తమిళనాడులో మరో 66 మందికి కరోనా.. అందులో ఆరుగురు చిన్నారులు..

ABN , First Publish Date - 2020-04-26T03:25:18+05:30 IST

తమిళనాడులో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా మరో 66 మందికి కొవిడ్-19 పాజిటివ్..

తమిళనాడులో మరో 66 మందికి కరోనా.. అందులో ఆరుగురు చిన్నారులు..

చెన్నై: తమిళనాడులో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా మరో 66 మందికి కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. ఇందులో రెండేళ్ల పాప, నాలుగేళ్ల బాబు సహా ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు తమిళనాట కరోనా బారిన పడిన వారి సంఖ్య 1821కి చేరినట్టైంది. వీరిలో ప్రస్తుతం 835 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇప్పటి వరకు 960 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇవాళ ఒక్కరోజే  94 మంది డిశ్చార్జయినట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఓ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న 34 ఏళ్ల వ్యక్తి గత రాత్రి మృతి చెందాడనీ... దీంతో కరోనా మృతుల సంఖ్య 23కి చేరిందని ప్రభుత్వం తెలిపింది. 

Updated Date - 2020-04-26T03:25:18+05:30 IST