నిత్యావసరాల అమ్మకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

ABN , First Publish Date - 2020-04-05T03:09:47+05:30 IST

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

నిత్యావసరాల అమ్మకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

చెన్నై: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యావసరాల అమ్మకాల షాపుల సమయాన్ని కుదించినట్లు తమళనాడు సర్కారు పేర్కొంది. ఆదివారం 5-4-2020 నుంచి మధ్యాహ్నం 1 గంటకు మూసివేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సీఎం పళనిస్వామి చెప్పారు. ఖచ్చితంగా ప్రజలంతా సామాజిక దూరం పాటించి కరోనా వైరస్‌పై పోరాటం చేయాలని సీఎం సూచించారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. తమిళనాడులో ప్రస్తుతం అవసరమైన వస్తువులను విక్రయించే దుకాణాలకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాపారం చేయడానికి అనుమతి ఉండేది. కరోనా వైరస్ కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-04-05T03:09:47+05:30 IST