అరెకా నట్ మింగిన బాలుడికి శస్త్ర చికిత్స విజయవంతం

ABN , First Publish Date - 2020-05-08T20:53:12+05:30 IST

అరెకా నట్ మింగేసిన మూడేళ్ళ బాలుడికి తమిళనాడులోని కోయంబత్తూరు

అరెకా నట్ మింగిన బాలుడికి శస్త్ర చికిత్స విజయవంతం

చెన్నై : అరెకా నట్ (పోక చెక్క)ను మింగేసిన మూడేళ్ళ బాలుడికి తమిళనాడులోని కోయంబత్తూరు వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స చేశారు. అరెకా నట్ ఆ బాలుడి గొంతులో చిక్కుకుపోవడంతో కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేసి, ప్రాణాలను కాపాడారు. 


గోబిచెట్టిపాలయం సమీపంలోని ఓ గ్రామంలో ఈ బాలుడి కుటుంబం నివసిస్తోంది. అరెకా నట్ మింగిన వెంటనే ఆ బాలుడిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆ బాలుడిని కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని చెప్పారు. 


కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆ బాలుడికి గురువారం శస్త్ర చికిత్స చేసి, అరెకా నట్‌ను తీసేసి, ప్రాణాలను కాపాడారు. 


ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడీ, ఈఎన్‌టీ డిపార్ట్‌మెంట్ డాక్టర్ అలీ సుల్తాన్ మాట్లాడుతూ ఈ శస్త్ర చికిత్సను వెంటనే చేసి ఉండకపోతే, బాలుడు మనకు దక్కేవాడు కాదన్నారు. అరెకా నట్ ఉబ్బిందని, గొంతులో అడ్డంగా ఉందని, ఊపిరి పీల్చడం, వదలడం సాధ్యంకాని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.


బాలుడి తల్లిదండ్రులు, బంధువులు వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.


Updated Date - 2020-05-08T20:53:12+05:30 IST