తమిళనాడులో 5 లక్షల మార్క్‌ను దాటిన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-14T00:57:57+05:30 IST

తమిళనాడులో 5 లక్షల మార్క్‌ను దాటిన కరోనా కేసులు

తమిళనాడులో 5 లక్షల మార్క్‌ను దాటిన కరోనా కేసులు

చెన్నై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ తమిళనాడు రాష్ట్రంలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో ఆదివారం రోజు కొత్తగా మరో 5,693 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో కరోనా కేసులు 5 లక్షల మార్కును అధిగమించి, ప్రస్తుతం మొత్తం 5,02,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ కరోనా వల్ల 74 మరణాలు నమోదవగా, కరోనా వల్ల మొత్తం 8,381 మృతి చెందారు. ఆదివారం రోజు కరోనా నుంచి 5,717 మంది కోలుకొగా, మొత్తం 4,47,366 మంది కోలుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం 47,012 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు.

Updated Date - 2020-09-14T00:57:57+05:30 IST