తమిళనాడు రాజధాని మార్పు?
ABN , First Publish Date - 2020-07-27T07:33:17+05:30 IST
తమిళనాడు రాజధాని మార్పు?

- చెన్నైలో కరోనా వ్యాప్తితో మళ్లీ అదే చర్చ
చెన్నై, జూలై 26(ఆంధ్రజ్యోతి): చెన్నైలో కరోనా విజృంభిస్తుండటంతో తమిళనాడు రాజధానిని మార్చాలనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. రాజధానిని చెన్నై నుంచి మరో నగరానికి తరలించాలని మూడు దశాబ్దాల క్రితమేప్రయత్నాలు జరిగాయి. తిరుచ్చి నగరాన్ని రాజధానిగా మార్చాలని దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ ప్రయత్నిస్తే, డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి చెన్నైలో జనసాంద్రతను తగ్గించేందుకు సబర్బన్ ప్రాంతాలను కలుపుకొని సకల సదుపాయాలతో శాటిలైట్ నగరాన్ని రూపొందించాలని ప్రయత్నించారు. ఆ ఇరువురి ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు రావడంతో రెండు ఫైళ్లూ బుట్టదాఖలయ్యాయి. తాజాగా, చెన్నై పూర్తిగా కరోనా కోరల్లో చిక్కుకోవడంతో.. ఎంజీఆర్ ప్రతిపాదించినట్లు తిరుచ్చిని రాజధానిగా చేసి ఉంటే 90 వేలమంది చెన్నైవాసులు వైరస్ బారినపడి ఉండేవారు కాదని మేధావులు పేర్కొంటున్నారు.