రైతులతో మళ్లీ కేంద్రం చర్చలు: హర్యానా సీఎం

ABN , First Publish Date - 2020-12-20T05:29:24+05:30 IST

రెండు మూడు రోజుల్లో రైతులతో మళ్లీ కేంద్రం చర్చలు: హర్యానా సీఎం

రైతులతో మళ్లీ కేంద్రం చర్చలు: హర్యానా సీఎం

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో కేంద్రం రెండు మూడు రోజుల్లో మరో దఫా చర్చలు జరుపుతుందని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. రైతుల ఆందోళనపై ఆయన ఇవాళ కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్‌తో సమావేశం అయ్యారు. ‘‘చర్చల ద్వారానే రైతుల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని నేను కేంద్రాన్ని కోరాను..’’ అని ఖట్టర్ పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతులు లేవనెత్తిన అన్ని సమస్యలను చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. కాగా మొత్తం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళన శనివారం నాటికి 24వ రోజుకు చేరింది. 

Read more