రెచ్చిపోయిన తాలిబన్లు.. ఏడుగురు మృతి
ABN , First Publish Date - 2020-05-19T03:33:18+05:30 IST
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఘజినీలోని ఆఫ్ఘన్ ఇంటెలిజెన్స్ కార్యాలయానికి సమీపంలో కారు బాంబ్‌ను పేల్చారు. ఈ ఘటనలో దాదాపు ఏడుగురు చనిపోగా.. 40 మంది వరకు

ఘజిని: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఘజినీలోని ఆఫ్ఘన్ ఇంటెలిజెన్స్ కార్యాలయానికి సమీపంలో కారు బాంబ్‌ను పేల్చారు. ఈ ఘటనలో దాదాపు ఏడుగురు చనిపోగా.. 40 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇటీవలే తాలిబన్ సంస్థ, అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరిగింది. భారత్‌తో శాంతి చర్చలకు సిద్ధం అని కూడా తాలిబన్లు ప్రకటించారు. ఇలాంటి సమయంలో మరోసారి రెచ్చిపోవడం కలకలం సృష్టిస్తోంది. ఉగ్రదాడిని ఆఫ్ఘన్ ప్రభుత్వం అధికారంగా ధృవీకరించింది.