తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి లేదు: ఆగ్రా జిల్లా యంత్రాంగం

ABN , First Publish Date - 2020-07-06T03:54:21+05:30 IST

అన్‌లాక్-2లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న దర్శనీయ స్థలాలకు యాత్రికులను...

తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి లేదు: ఆగ్రా జిల్లా యంత్రాంగం

ఆగ్రా: అన్‌లాక్-2లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న దర్శనీయ స్థలాలకు యాత్రికులను సోమవారం నుంచి అనుమతించాలని కేంద్రం నిర్ణయించినప్పటికీ తాజ్‌మహల్ సందర్శనకు అనుమతి లేదని ఆగ్రా జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. జిల్లాలో గడచిన 4 రోజులుగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో అనుమతించలేమని తెలిపింది. ఆగ్రా జిల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో 55 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆగ్రాలో 71 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో యాత్రికులను తాజ్‌మహల్ సందర్శనకు అనుమతించడం శ్రేయస్కరం కాదని జిల్లా యంత్రాంగం భావించింది.


జూలై 6 నుంచి దేశంలోని దర్శనీయ స్థలాలకు యాత్రికులకు అనుమతి ఉంటుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు ఆగ్రాలోని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం కూడా తాజ్‌మహల్‌ను తిరిగి ఓపెన్ చేసేందుకు సన్నద్ధమైంది. అయితే.. జిల్లా యంత్రాంగం తాజ్‌మహల్‌ను ఓపెన్ చేయకూడదని తుది నిర్ణయాన్ని ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 17 నుంచి తాజ్‌మహల్‌ను మూసేశారు.

Updated Date - 2020-07-06T03:54:21+05:30 IST