చైనా దెబ్బకు అమెరికా విమానాల కొంటున్న తైవాన్!

ABN , First Publish Date - 2020-08-16T06:04:58+05:30 IST

చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో తైవాన్ కూడా అమెరికా యుద్ధ విమానాల కొనుగోలుకు మొగ్గు చూపింది.

చైనా దెబ్బకు అమెరికా విమానాల కొంటున్న తైవాన్!

తైపీ: చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో తైవాన్ కూడా అమెరికా యుద్ధ విమానాల కొనుగోలుకు మొగ్గు చూపింది. ఏకంగా 66 ఎఫ్-16 అత్యాధునిక యుద్ధ విమానాల కొనుగోలుకు లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకుంది. వీటి తయారీ 2026 నాటికి పూర్తవుతుందని సమాచారం. 1992 తరువాత తైవాన్..యుద్ధ విమానాల కోసం ఈ స్థాయి ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ 150 ఎఫ్-16 యుద్ధ విమానాలను తైవాన్‌కు అమ్మేందుకు అంగీకరించారు. అయితే తైవాన్‌ను తమ భూభాగంగా భావించే చైనా మాత్రం తొలి నుంచీ ఇటువంటి ఆయుధ కొనుగోళ్లను వ్యతిరేకిస్తోంది. తైవాన్ యుద్ధ విమానాలు అమ్మవద్దంటూ అమెరికాకు చైనా గత ఏడాది విజ్ఞప్తి చేసింది. 

Updated Date - 2020-08-16T06:04:58+05:30 IST