డ్రాగన్‌పై రామ బాణం
ABN , First Publish Date - 2020-06-18T07:10:30+05:30 IST
గాల్వన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. చైనా నుంచీ 43 మంది సైనికులు చనిపోయారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల ప్రజలు స్పందిస్తూ జాతీయతను...

తైపీ, జూన్ 17: గాల్వన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. చైనా నుంచీ 43 మంది సైనికులు చనిపోయారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల ప్రజలు స్పందిస్తూ జాతీయతను చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డ్రాగన్‌పై రాముడు తన బాణాన్ని గురిపెట్టిన ఫొటోను ‘తైవాన్ న్యూస్ వెబ్‌సైట్’ ప్రచురించింది. ‘చైనా డ్రాగన్‌ను రా ముడు ఎదుర్కొన్నాడు’ అంటూ శీర్షిక పెట్టి వ్యాసం రాసింది. ఈ గొడవలో 20 భారత సైనికులు అమరులయ్యారని, 43 మంది తమ సైనికులు కూడా చనిపోయి లేదా గాయపడి ఉండొచ్చని పీఎల్‌ఏ పేర్కొన్నట్లు ఆ వ్యాసంలో పేర్కొంది.