తబ్లిగి జమాత్ సభ్యులపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-05-12T03:29:56+05:30 IST

తబ్లిగి జమాత్ సభ్యులపై బీజేపీ ఎంపీ అజయ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లోని

తబ్లిగి జమాత్ సభ్యులపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ముజఫర్‌పూర్: తబ్లిగి జమాత్ సభ్యులపై బీజేపీ ఎంపీ అజయ్ నిషాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్ ఎంపీ అయిన ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ను వ్యాపింపజేసినందుకు తబ్లిగి జమాత్ సభ్యులను ఉగ్రవాదుల్లా చూడాలని వ్యాఖ్యానించారు. దేశంలో నేడు ఈ పరిస్థితికి తబ్లిగి జమాతే కారణమన్న ఆయన.. మదర్సాలలో పంక్చర్లు ఎలా చేయాలో మాత్రమే నేర్పుతారని, అందువల్లే వీరు దీనిని (మహమ్మారి) మరింత ప్రమాదకరంగా మార్చారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.


దేశంలోని వివిధ ప్రాంతాలకు వైరస్ వ్యాపింపజేసిన నిజాముద్దీన్ తబ్లిగి జమాత్ మర్కజ్ సభ్యులను ప్రభుత్వం ఉగ్రవాదుల్లా చూడాలని పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిషాద్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Updated Date - 2020-05-12T03:29:56+05:30 IST