చైనా వస్తువులను బహిష్కరించండి : స్వదేశీ జాగరణ్ మంచ్
ABN , First Publish Date - 2020-04-25T22:01:02+05:30 IST
చైనా ఆధారిత వస్తువులను వాడటం నిషేధించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ పిలుపునిచ్చింది. ఆదివారం నుంచి దీనిని ఓ ఉద్యమంగా నిర్వహిస్తామని ఆ సంస్థ

నాగపూర్ : చైనా ఆధారిత వస్తువులను వాడటం నిషేధించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ పిలుపునిచ్చింది. ఆదివారం నుంచి దీనిని ఓ ఉద్యమంగా నిర్వహిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. చైనా వస్తువులను బహిష్కరించాలన్నది ఈ సంస్థ మూల సూత్రాలలో ఒకటిగా ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో చైనాపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో మరోసారి స్వదేశీ జాగరణ్ మంచ్ ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. ఏప్రిల్ 25 ను అందరూ ‘స్వదేశీ సంకల్ప్ దివస్’గా జరుపుకోవాలని ఆ సంస్థ పిలుపునిచ్చింది.
‘‘ఏప్రిల్ 25 న తమ తమ ఇళ్లలో సాయంత్రం 6:30 నుంచి 6:40 వరకూ దీపాలు వెలిగించి, చైనా వస్తువులను బహిష్కరిస్తున్నట్లు ప్రతిజ్ఞ చేయాలి’’ అని స్వదేశీ జాగరణ్ మంచ్ కో కన్వీనర్ అశ్వనీ మహజన్ తెలిపారు. లాక్‌డౌన్, ఆర్థిక నష్టం, ఉద్యోగాలు ఊడిపోవడం ఇవన్నీ కూడా చైనా సృష్టించిన కరోనా వైరస్ వల్లేనని, చైనా వైరస్‌తో దేశ ఆర్థిక రంగంతో పాటు ప్రపంచ ఆర్థిక రంగం కూడా బాగా కుదేలైందని అశ్వనీ మహజన్ మండిపడ్డారు.