నిన్న పదవికి, నేడు పార్టీకి రాజీనామా చేసిన సువేందు
ABN , First Publish Date - 2020-12-17T21:38:50+05:30 IST
నిన్న పదవికి, నేడు పార్టీకి రాజీనామా చేసిన సువేందు

కోల్‌కతా: అనుకున్నట్టుగానే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సువేందు అధికారి రాజీనామా చేశారు. బుధవారం శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన ఒకరోజు తర్వాత టీఎంసీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. కాగా, త్వరలోనే ఈయన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. మమత కేబినేట్‌లో మంత్రిగా పని చేసిన ఈయన కొంత కాలంగా పార్టీతో విభేదిస్తున్నారు.
తన రాజీనామా లేఖను టీఎంసీ అధినేత మమతా బెనర్జీకి పంపించారు. ‘‘గౌరవనీయులైన మేడమ్.. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని స్థానాలకు రాజీనామా చేస్తున్నాను. పార్టీలో నాకు కల్పించిన అవకాశాలకు ధన్యవాదాలు. పార్టీలో నేను గడిపిన సమయాన్ని విలువైనదిగా భావిస్తాను’’ అని సువేందు రాసుకొచ్చారు.