యూపీలో పూజారి అనుమానాస్పద మృతి

ABN , First Publish Date - 2020-10-19T06:27:23+05:30 IST

యూపీలో ఓ పూజారి ఆలయంలోనే అనుమానాస్ప ద రీతిలో మృతిచెందారు. ఆయన

యూపీలో పూజారి అనుమానాస్పద మృతి

బరేలీ, అక్టోబరు 18: యూపీలో ఓ పూజారి ఆలయంలోనే అనుమానాస్ప ద రీతిలో మృతిచెందారు. ఆయన అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతుండటంతో ఆ వర్గాలే ఆయన్ను హత్య చేశాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం తర్వాతే ఆయన మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.


మృతుడు రాందాస్‌ జీ మహరాజ్‌ మొరాదాబాద్‌ అసలత్‌పురలోని ఓ ఆలయంలో పనిచేస్తున్నారు. మొరాదాబాద్‌లో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న రామ్‌గంగా కాలుష్య నియంత్రణ కమిటీలో ఆయన సభ్యుడు. ఆ అక్రమ మైనింగ్‌పై న్యాయ పోరాటం కూడా చేస్తున్నారు. 


Updated Date - 2020-10-19T06:27:23+05:30 IST