ఛత్తీ్‌సగఢ్‌లో 38 మంది మావోయిస్టుల లొంగుబాటు

ABN , First Publish Date - 2020-10-27T06:43:04+05:30 IST

ఛత్తీ్‌సగఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఆదివారం 32 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట

ఛత్తీ్‌సగఢ్‌లో 38 మంది మావోయిస్టుల లొంగుబాటు

చర్ల/దుమ్ముగూడెం, అక్టోబరు 26: ఛత్తీ్‌సగఢ్‌లోని దంతెవాడ జిల్లాలో ఆదివారం 32 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 10 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టు పార్టీలోని డొల్ల సిద్ధాంతాలకు విసిగిపోయి వారు లొంగిపోయినట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ తెలిపారు. 


వీరిలో నలుగురిపై లక్ష రూపాయల చొప్పున రివార్డులు ఉన్నాయని తెలిపారు. కాగా, పోలీసు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తూ ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన నాయకులపు ఈశ్వర్‌(30) అనే వ్యక్తిని ఆదివారం ఉదయం మావోయిస్టులు హతమార్చారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం రహదారిపై మృతదేహాన్ని పడేశారు.


Updated Date - 2020-10-27T06:43:04+05:30 IST