మహిళా ఉద్యోగినులకు ఏడాదికి 12 రోజుల పిరియడ్సు సెలవు

ABN , First Publish Date - 2020-08-14T12:49:05+05:30 IST

సూరత్ నగరానికి చెందిన ఓ డిజిటల్ మార్కెటింగు కంపెనీ తన సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులకు ఏడాదికి 12 రోజుల పాటు అదనంగా పిరియడ్సు సెలవు మంజూరు చేసింది.....

మహిళా ఉద్యోగినులకు ఏడాదికి 12 రోజుల పిరియడ్సు సెలవు

సూరత్ (గుజరాత్): సూరత్ నగరానికి చెందిన ఓ డిజిటల్ మార్కెటింగు కంపెనీ తన సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులకు ఏడాదికి 12 రోజుల పాటు అదనంగా పిరియడ్సు సెలవు మంజూరు  చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరానికి చెందిన భూతిక్ శేత్ 2014లో స్థాపించిన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలో 9 మంది ఉద్యోగులుండగా, వారిలో 8మంది మహిళా ఉద్యోగినులున్నారు. ‘‘భారతీయ సమాజంలో రుతుస్రావంపై ఇప్పటికీ నిషేధం ఉంది. నేటికి కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలు వాష్ రూంకు వెళ్లేటపుడు చేతిలో బ్యాగ్ తీసుకొని వెళుతుంటారు...మహిళలు, పురుషుల మధ్య జీవ సంబంధమైన వ్యత్యాసాన్ని అర్థం చేసుకొని పిరియడ్స్ సమయంలో మహిళలు అసౌకర్యానికి గురికాకుండా తాము ఏడాదికి 12 రోజుల పాటు అదనంగా పిరియడ్సు సెలవును మంజూరు చేశాం’’ అని భూత్ శేత్ చెప్పారు. భూతిక్ శేత్ బాటలో పయనిస్తూ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో కూడా తమ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులకు 12రోజుల పాటు పిరియడ్స్ సెలవులు మంజూరు చేశారు. ఐవీపానన్ అనే సంస్థ వ్యవస్థాపకుడు తన సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులకు 12 రోజుల పాటు పిరియడ్సు లీవ్ లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 

Updated Date - 2020-08-14T12:49:05+05:30 IST