రేషన్‌ కార్డుల రద్దుపై హైకోర్టుకు వెళ్లండి: సుప్రీం

ABN , First Publish Date - 2020-06-18T07:39:54+05:30 IST

రాష్ట్రంలో రద్దు చేసిన తెల్ల రేషన్‌ కార్డుల పునరుద్ధరణపై మే నెలలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది...

రేషన్‌ కార్డుల రద్దుపై హైకోర్టుకు వెళ్లండి: సుప్రీం

న్యూఢిల్లీ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రద్దు చేసిన తెల్ల రేషన్‌ కార్డుల పునరుద్ధరణపై మే నెలలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించాలని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ దశలో హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని, ఆదేశాలను సవరించాలని తిరిగి హైకోర్టునే ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌కౌల్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. 


Updated Date - 2020-06-18T07:39:54+05:30 IST