అశ్లీల వీడియోలను తొలగించాల్సిందే: సుప్రీం

ABN , First Publish Date - 2020-02-12T08:55:24+05:30 IST

సామాజిక మాధ్యమాల్లో చిన్నారులతో అశ్లీల చిత్రాలు, మహిళలపై అత్యాచారాలకు సంబంధించిన వీడియోలను

అశ్లీల వీడియోలను తొలగించాల్సిందే: సుప్రీం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: సామాజిక మాధ్యమాల్లో చిన్నారులతో అశ్లీల చిత్రాలు, మహిళలపై అత్యాచారాలకు సంబంధించిన వీడియోలను తొలగించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మళ్లీ ఆదేశించింది. ఈ విషయంలో గూగుల్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ సహా ఇంటర్నెట్‌ ఇంటర్మీడియరీ సంస్థలతో చర్చలు ప్రారంభించాల్సిందిగా కోర్టు కోరింది. సీజే జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం తాజా ఆదేశాలిచ్చింది. 2015లో హైదరాబాద్‌కు చెందిన ‘ప్రజ్వల’ స్వచ్ఛంద సంస్థ నాటి సీజేఐకు రాసిన లేఖను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుంది.  

Updated Date - 2020-02-12T08:55:24+05:30 IST