డాక్టర్లకు, సిబ్బందికి టైమ్‌కి వేతనాలు

ABN , First Publish Date - 2020-08-01T08:45:55+05:30 IST

కొవిడ్‌ రోగులకు చికిత్స చేసే డాక్టర్లకు, వైద్య సిబ్బందికి నిర్దేశిత తేదీకల్లా

డాక్టర్లకు, సిబ్బందికి టైమ్‌కి వేతనాలు

క్వారంటైన్‌ను లీవుగా చూడొద్దు:సుప్రీం


న్యూఢిల్లీ, జూలై 31: కొవిడ్‌ రోగులకు చికిత్స చేసే డాక్టర్లకు, వైద్య సిబ్బందికి నిర్దేశిత తేదీకల్లా రాష్ట్రాలు వేతనాలు చెల్లించేలా కేంద్రం చూడాలని సుప్రీంకోర్టు కోరింది. అలాగే ఆయా డాక్టర్లు, వైద్య సిబ్బంది క్వారంటైన్‌ రోజులను సెలవుగా పరిగణించరాదని కూడా సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ తగినవిధంగా ఆదేశాలివ్వాలని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. కొవిడ్‌ రోగులకు చికిత్స అందించే ఆరోగ్య కార్యకర్తలు క్వారంటైన్‌లో ఉన్నంతకాలం ఆ కాలాన్ని లీవుగా పరిగణించడం, ఆ కాలానికి వేతనాలలో కోత పెట్టడానికి సంబంధించి కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘కేంద్ర ఆదేశాలను ఒకవేళ రాష్ట్రాలు బేఖాతరు చేస్తే కేంద్రం నిస్సహాయం గా ఉండిపోనక్కర్లేదు. విపత్తు నిర్వహణ చట్టం కింద ఆయా ఉత్తర్వులను రాష్ట్రాలు పాటించేలా చేసేందుకు కేంద్రానికి అధికారం ఉంటుంది’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. 


Updated Date - 2020-08-01T08:45:55+05:30 IST