యూకేలో చిక్కుకున్న భారతీయుల సంగతేంటి?: కేంద్రానికి సుప్రీం నోటీసులు

ABN , First Publish Date - 2020-04-08T01:07:12+05:30 IST

లాక్‌డౌన్ కారణంగా యూకేలో చిక్కుకున్న భారత విద్యార్ధులపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇవాళ ..

యూకేలో చిక్కుకున్న భారతీయుల సంగతేంటి?: కేంద్రానికి సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా యూకేలో చిక్కుకున్న భారత విద్యార్ధులపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది. వాళ్లను వెనక్కి తీసుకువచ్చేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌పై పూర్తి వివరాలతో స్పందించాలని కోరింది. ఈ మేరకు న్యాయవాది మధురిమ మృదుల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా కరోనా వైరస్ కారణంగా చైనా, ఇటలీ, ఇరాన్ తదితర దేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇప్పటికే కేంద్రం స్వదేశానికి తరలించింది.

Read more