జర్నలిస్ట్ అమిష్ దేవ్‌గన్‌కు అనుకూలంగా సుప్రీం ఆదేశాలు
ABN , First Publish Date - 2020-07-09T01:30:39+05:30 IST
అమిష్ దేవ్గన్ పక్షపాతంతో వ్యవహరిస్తారని విమర్శలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. సోషల్ మీడియాలో నెటిజెన్ల మధ్య తరుచూ చర్చ జరుగుతుంటుంది.

న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు అమిష్ దేవ్‌గన్‌కు అరెస్ట్‌కు సుప్రీం కోర్టు కొంత కాలం వరకు బ్రేకులు వేసింది. మరో కొంత కాలం వరకు ఆయనను అరెస్ట్ చేయరాదని ధర్మాసనం పేర్కొంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా మత గురువు సూఫీ మహ్మద్‌పై లైవ్ డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై పలు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. ఈ విషయమై స్పందించిన సుప్రీం పై విధంగా స్పందించింది. అంతే కాకుండా విచారణ సైతం తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అమిష్ దేవ్గన్ పక్షపాతంతో వ్యవహరిస్తారని విమర్శలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. సోషల్ మీడియాలో నెటిజెన్ల మధ్య తరుచూ చర్చ జరుగుతుంటుంది.