పారిశ్రామికవేత్త జయరాం హత్యకేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ
ABN , First Publish Date - 2020-12-03T18:21:10+05:30 IST
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది.

న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. రాకేశ్‌రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి వాదనలు వినిపించారు. నిందితుడు 21 నెలలుగా జైలులోనే ఉన్నాడని, వృద్ధులైన తల్లిదండ్రుల బాధ్యతలు చూసుకోవాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాకేశ్‌రెడ్డిపై మరో పది కేసులకుపైగా ఉన్నాయని, బెయిల్ ఇచ్చేది లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు హాజరు కాకపోవడంతో విచారణను సుప్రీంకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.