ఏఐసీటీఈ ప్రమాణాలను తగ్గించరాదు

ABN , First Publish Date - 2020-12-11T08:18:22+05:30 IST

కొత్త కోర్సులకు గుర్తింపును ఇచ్చే విషయంలో ఏఐసీటీఈ ప్రమాణాలను యూనివర్సిటీలు తగ్గించలేవని,

ఏఐసీటీఈ ప్రమాణాలను తగ్గించరాదు

యూనివర్సిటీలకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ 


న్యూఢిల్లీ, డిసెంబరు 10: కొత్త కోర్సులకు గుర్తింపును ఇచ్చే విషయంలో ఏఐసీటీఈ ప్రమాణాలను యూనివర్సిటీలు తగ్గించలేవని, అయితే అంతకంటే మెరుగైన నిబంధనలను నిర్దేశించుకునే అధికారం విశ్వవిద్యాలయాలకు ఉన్నదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేరళలోని ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ కొత్త కోర్సుల గుర్తింపునకు సంబంధించి నిబంధనలను జారీ చేసింది. ఈ నిబంధనలను కేరళ హైకోర్టులో సవాలు చేయగా  న్యాయస్థానం వర్సిటీ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. గురువారం పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఏ.బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పైవిధంగా తీర్పు ఇచ్చింది.

Updated Date - 2020-12-11T08:18:22+05:30 IST