ఆదివారం మాత్రం రాష్ట్రంలో పూర్తిగా కర్ఫ్యూ : సీఎం కీలక ప్రకటన

ABN , First Publish Date - 2020-05-18T19:24:10+05:30 IST

లాక్‌డౌన్ 4.0 నిబంధనల్లో భాగంగా ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో

ఆదివారం మాత్రం రాష్ట్రంలో పూర్తిగా కర్ఫ్యూ : సీఎం కీలక ప్రకటన

బెంగళూరు : లాక్‌డౌన్ 4.0 నిబంధనల్లో భాగంగా ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భారీగా సడలింపులు ప్రకటిస్తూనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం మాత్రం రాష్ట్రం మొత్తం పూర్తిగా కర్ఫ్యూలోకి వెళ్లిపోతుందని, ఆదివారం కర్ఫ్యూను పకడ్బందీగా అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.  రాష్ట్రంలోని అన్ని దుకాణాలనూ నిరభ్యంతరంగా తెరుచుకోవచ్చని, రైళ్లు కూడా రాష్ట్రంలోపల అన్ని ప్రాంతాలకూ వెళ్లవచ్చని తేల్చి చెప్పారు. రెడ్‌జోన్లు, కంటేయిన్‌మెంట్ ప్రాంతాలకు మాత్రం ఇది వర్తించదని తేల్చి చెప్పారు. ‘‘రెడ్‌జోన్లు, కంటేయిన్‌మెంట్ ప్రాంతాల్లో మాత్రం నిబంధనలు మరింత కఠినంగా ఉంటాయి. మిగితా ప్రాంతాల్లో మాత్రం అన్నిరకాల కార్యకలాపాలు నిర్వర్తించుకోవచ్చు.’’ అని సీఎం యడియూరప్ప ప్రకటించారు. 

Updated Date - 2020-05-18T19:24:10+05:30 IST