ఎంపీల వేతనాల్లో కోతపై సుమలత ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2020-04-07T16:37:00+05:30 IST

రెండేళ్ళపాటు ఎంపీలాడ్‌ నిధుల నిలిపివేత, వేతనాల్లో 30 శాతం కోత విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని

ఎంపీల వేతనాల్లో కోతపై సుమలత ఏమన్నారంటే..

  • కరోనాపై పోరుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటన

బెంగళూరు : కరోనా మహమ్మారిపై యుద్ధం కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఈ విషయంలో తమకు దేశప్రయోజనాలే ముఖ్యమని పలువురు రాష్ట్ర ఎంపీలు స్పష్టం చేశారు. రెండేళ్ళపాటు ఎంపీలాడ్‌ నిధుల నిలిపివేత, వేతనాల్లో 30 శాతం కోత విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా హర్షిస్తున్నట్లు బెంగళూరు దక్షిణ లోక్‌సభ సభ్యుడు తేజస్విసూర్య తెలిపారు. నగరంలో సోమవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌ కూడా కేంద్రమంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.


దేశప్రజలు అత్యంత క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో తాము ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఆయన వెల్లడించారు. కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌ జోషి, డివి.సదానందగౌడలు కూడా కేంద్రప్రభుత్వ నిర్ణయంపై తమ హర్షంవ్యక్తంచేశారు. ఇదే విధానాన్ని అన్నిరాష్ట్రాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పాటిస్తే చాలా బాగుంటుందని సూచించారు.


కేంద్రమంత్రిమండలి ఈ జటిల సమయంలో తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని మండ్య ఎంపీ సుమలత పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఇదే విధంగా తమ వేతనాల్లో కొంత భాగాన్ని కరోనా పీడితులకోసం స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆమె పిలపునిచ్చారు.

Updated Date - 2020-04-07T16:37:00+05:30 IST