ఆత్మహత్య చేసుకున్న టీవీ నటుడు

ABN , First Publish Date - 2020-05-17T23:54:15+05:30 IST

టీవీ నటుడు మన్‌మీత్ గ్రేవాల్ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పలు టీవీ షోల్లో చేసిన మన్‌మీత్‌కు లాక్‌డౌన్ కారణంగా అవకాశాలు లభించలేదు. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు

ఆత్మహత్య చేసుకున్న టీవీ నటుడు

ముంబై: టీవీ నటుడు మన్‌మీత్ గ్రేవాల్ తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పలు టీవీ షోల్లో చేసిన మన్‌మీత్‌కు లాక్‌డౌన్ కారణంగా అవకాశాలు లభించలేదు. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన మన్‌మీత్ తన ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 


వివరాల్లోకెళితే.. 32 ఏళ్ల మన్‌మీత్ తన గదిలోకి వెళ్లి డోర్ వేసుకున్నాడు. ఆ సమయంలో అతని భార్య వంట గదిలో వంట చేస్తోంది. ఇంతలో బెడ్ రూమ్‌ నుంచి శబ్దం వచ్చింది. దీంతో కంగారుపడ్డ అతని భార్య బెడ్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా, మన్‌మీత్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. దీంతో ఆమె పెద్దగా అరిచింది. కాపాడండి అంటూ చుట్టుపక్కల వారిని పిలిచింది. అయితే కరోనా భయంతో ఎవరూ స్పందించలేదు. ఎట్టకేలకు అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డులు వచ్చి మన్‌మీత్‌ను కిందకు దింపి.. ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 


అయితే అతని ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తోంది. ఇంటి అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవని తెలుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా అవకాశాలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. కాగా, మన్‌మీత్.. అదత్ సే మజ్బూర్, కుల్దీపక్ టీవీ షోలలో నటించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-05-17T23:54:15+05:30 IST