కరోనాతో కుదేలైన పంచదార పరిశ్రమ...

ABN , First Publish Date - 2020-06-24T00:07:02+05:30 IST

పంచదార పరిశ్రమపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 20 లక్షల టన్నుల చక్కెర నిల్వలు పేరుకుపోయాయి. ముఖ్యంగా ఐస్ క్రీం, శీతల పానీయాల డిమాండ్ పడిపోవడంతో చక్కెర నిల్వలు పేరుకుపోయాయి. మార్చి 25 నుంచి దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న విషయం విదితమే. లాక్‌డౌన్ నేపధ్యంలో చక్కెర పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమైంది.

కరోనాతో కుదేలైన పంచదార పరిశ్రమ...

న్యూఢిల్లీ : పంచదార పరిశ్రమపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 20 లక్షల టన్నుల చక్కెర నిల్వలు పేరుకుపోయాయి. ముఖ్యంగా ఐస్ క్రీం, శీతల పానీయాల డిమాండ్ పడిపోవడంతో చక్కెర నిల్వలు పేరుకుపోయాయి. మార్చి 25 నుంచి దేశంలో లాక్‌డౌన్ అమల్లో ఉన్న విషయం విదితమే. లాక్‌డౌన్ నేపధ్యంలో చక్కెర పరిశ్రమ తీవ్రంగా ప్రభావితమైంది.


ఏప్రిల్‌లో 18 లక్షల టన్నులు, మేలో 17 లక్షల టన్నులను విక్రయించడానికి ప్రభుత్వం కోటాను నిర్ణయించింది. కానీ అమ్మకాలు పెద్దగా ఊపందుకోలేదు. అయితే... జూలై నుంచి చక్కెర డిమాండ్ నెమ్మదిగా ఊపందుకునే అవకాశం ఉంది. ఐఎఎన్ఎస్ నివేదికల వార్తల ప్రకారం... ఈ సంవత్సరం దేశంలో చక్కెర ఉత్పత్తి 272 లక్షల టన్నుల వరకు ఉంది.


మామూలుగానైతే... వేసవి కాలం ప్రారంభమయ్యే ముందు ప్రతీ సంవత్సరం ఐస్ క్రీంలు, శీతల పానీయాల తయారీ నేపధ్యంలో చక్కెర డిమాండ్ పెరుగుతూంటుంది. అయితే... కరోనా దెబ్బతో ఈ సంవత్సరం చక్కెర డిమాండ్ పడిపోయింది. చక్కెర మిల్లులు దాదాపు 20 లక్షల టన్నుల చక్కెరను అమ్మలేకపోయాయి. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతామోనని చక్కెర పరిశ్రమ నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు. 

Read more