క్వారంటైన్ నుంచి తప్పించుకున్న సబ్ కలెక్టర్
ABN , First Publish Date - 2020-03-27T20:55:34+05:30 IST
క్వారంటైన్ నుంచి తప్పించుకొని సొంతూరికి వెళ్లిపోయిన కొల్లాం సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రాపై కేరళ పోలీసులు
తిరువనంతపురం : క్వారంటైన్ నుంచి తప్పించుకొని సొంతూరికి వెళ్లిపోయిన కొల్లాం సబ్ కలెక్టర్ అనుపమ్ మిశ్రాపై కేరళ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. 14 రోజుల క్రితం ఈయన సింగపూర్ నుంచి తిరిగి రావడంతో పోలీసులు ఆయనను క్వారంటైన్‌కు తరలించారు. ఆయనను పరిశీలించడానికి వైద్యులు క్వారంటైన్‌కు చేరుకునే సరికి, అక్కడ ఆయన కనిపించలేదు. వెంటనే వైద్యులు ఆయన్ను ఫోన్‌లో సంప్రదించగా కాన్‌పూర్‌లో ఉన్నానని బదులిచ్చారు. దీంతో కొల్లాం కలెక్టర్ అబ్దుల్ నాసర్ తీవ్రంగా మండిపడ్డారు. పూర్తి బాధ్యతారాహిత్యంగా ఆయన ప్రవర్తిస్తున్నారని నాసర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆయనకు క్వారంటైన్‌లో సరైన ఆహారం లభ్యం కాకపోవడం వల్లే ఆయన సొంతూరికి వెళ్లిపోయారని కొందరు అధికారులు భావిస్తున్నారు.