మధ్యప్రదేశ్లో స్టడీ ఫ్రమ్ హోమ్... మారిన ప్రభుత్వోపాధ్యాయుల విధులు!
ABN , First Publish Date - 2020-07-08T14:29:08+05:30 IST
కరోనా వైరస్ అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా విద్యారంగాన్ని అమితంగా ప్రభావితం చేసింది. చిన్నారులు విద్యకు దూరమయ్యే పరిస్థితులు దాపురించాయి. అయితే వివిధ ప్రభుత్వాలు...

భోపాల్: కరోనా వైరస్ అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. ముఖ్యంగా విద్యారంగాన్ని అమితంగా ప్రభావితం చేసింది. చిన్నారులు విద్యకు దూరమయ్యే పరిస్థితులు దాపురించాయి. అయితే వివిధ ప్రభుత్వాలు దీనికి పరిష్కార మార్గాలను వెదుకుతున్నాయి. దీనిలో భాగంగా మధ్యప్రదేశ్ సర్కారు ప్రభుత్వ ఉపాధ్యాయులంతా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాఠాలు బోధించాలని కోరింది. ఈ విధానానికి సంబంధించిన కార్యక్రమం జూలై 6 నుండి మా ఇల్లే మా పాఠశాల పేరట ప్రారంభమయ్యింది. దీనిలో భాగంగా ఉపాధ్యాయులందరూ తమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారికి పాఠాలు బోధించాల్సివుంటుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు మాట్లాడుతూ చాలామంది విద్యార్థులకు మొబైల్ ఫోన్లు లేవని, వారికి ఆన్లైన్లో పాఠాలు బోధించడం కష్టమన్నారు. అందుకే ఉపాధ్యాయులే నేరుగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి పాఠాలు బోధిస్తున్నారన్నారు.