వర్సిటీల్లో పరీక్షల నిర్వహణను ఆపాలి

ABN , First Publish Date - 2020-07-28T06:59:28+05:30 IST

యూనివర్సిటీల్లో చివరి ఏడాది పరీక్షలు సెప్టెంబరు 30 కల్లా పూర్తి చేయాలన్న యూజీసీ మార్గదర్శకాలను శివసేన నేత ఆదిత్య థాక్రేతో సహా, బిహార్‌, అసోం రాష్ట్రాల వర్సిటీల విద్యార్థులు....

వర్సిటీల్లో పరీక్షల నిర్వహణను ఆపాలి

సుప్రీంలో శివసేన సహా బీహార్‌, అసోం విద్యార్థుల పిటిషన్లు 


న్యూఢిల్లీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల్లో చివరి ఏడాది పరీక్షలు సెప్టెంబరు 30 కల్లా పూర్తి చేయాలన్న యూజీసీ మార్గదర్శకాలను శివసేన నేత ఆదిత్య థాక్రేతో సహా, బిహార్‌, అసోం రాష్ట్రాల వర్సిటీల విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఈ పిటిషన్లకు 3 రోజుల్లో సమాధానం ఇవ్వాలని యూజీసీని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. కరోనా విజృంభిస్తున్న వేళ పరీక్షల నిర్వహణను పలు రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని, సాధ్యం కాని యూజీసీ మార్గదర్శకాలను రద్దు చేయాలని కోరారు. 

Updated Date - 2020-07-28T06:59:28+05:30 IST