విద్యార్థిని ఆత్మహత్య.. ఆమె చితిపై దూకి ప్రియుడు సైతం..

ABN , First Publish Date - 2020-09-03T18:19:11+05:30 IST

చెన్నై: తమిళనాడు రాష్ట్రం విల్లుపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆన్‌లైన్‌ క్లాసుల కోసం సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని...

విద్యార్థిని ఆత్మహత్య.. ఆమె చితిపై దూకి ప్రియుడు సైతం..

చెన్నై: చిన్న చిన్న కారణాలకే విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. తండ్రి సెల్ఫోన్ కొనివ్వలేదని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మరణాన్ని తట్టుకోలేని ఆమె ప్రియుడు చితిపై దూకి ఆత్మాహుతి చేసుకున్నాడు. తమిళనాడు రాష్ట్రం విల్లుపురంలో విషాదం చోటు చేసుకుంది.   


ఆన్‌లైన్‌ క్లాసుల కోసం సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని... డిగ్రీ విద్యార్థిని నిత్యశ్రీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేనందున నిత్యశ్రీ తండ్రి ఫోన్‌ కొనివ్వలేకపోయినట్టు తెలుస్తోంది. కాగా.. నిత్యశ్రీ మరణాన్ని తట్టుకోలేకపోయిన ప్రియుడు రాము సైతం.. శ్మశానంలో ఆమె చితిపై పడి ఆత్మాహుతి చేసుకుని మరణించాడు. విల్లుపురం జిల్లా ఉలుందురు పెట్టాయిలో ఈ ఘటన చోటు చేసుకుంది.


Updated Date - 2020-09-03T18:19:11+05:30 IST