అన్‌లైన్ క్లాసు కోసం గుట్ట ఎక్కితే.. వెనుక నుంచి చిరుత వచ్చి..

ABN , First Publish Date - 2020-10-04T02:25:27+05:30 IST

ఆన్‌లైన్ కాసు కోసం ఓ చిన్న గుట్టెక్కిన డిగ్రీ విద్యార్థిపై చిరుత దాడి చేసింది. గుజరాత్‌లోని ఖపాతీయ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్న బాధిత యువకుడు.. ఇంటర్నెట్ కనెక్షన్ సరిగా లేకపోవడంతో తన ఇంటికి సమీపంలో ఉన్న చిన్న గుట్ట ఎక్కాడు. అతడి వెనుక తన స్నేహితుడు కూడా వెళ్లాడు. వారు మెబల్‌లో క్లాసులు వింటుండగానే చిరుత వారిపై దాడి చేసింది.

అన్‌లైన్ క్లాసు కోసం గుట్ట ఎక్కితే.. వెనుక నుంచి చిరుత వచ్చి..

గాంధీనగర్: ఆన్‌లైన్ కాసు కోసం ఓ చిన్న గుట్ట ఎక్కిన డిగ్రీ విద్యార్థిపై చిరుత దాడి చేసింది. గుజరాత్‌లోని ఖపాతీయ గ్రామంలో ఈ దారుణం జరిగింది. ఆన్‌లైన్ క్లాసులకు హాజరవుతున్న బాధిత యువకుడు.. ఇంటర్నెట్ కనెక్షన్ సిగ్నల్ సరిగా లేకపోవడంతో తన ఇంటికి సమీపంలో ఉన్న చిన్న గుట్ట ఎక్కాడు. అతడి వెనుక తన స్నేహితుడు కూడా వెళ్లాడు. వారు మెబల్‌లో క్లాసులు వింటుండగానే చిరుత వారిపై దాడి చేసింది. 


‘అది వెనుక నుంచి చప్పుడు చేయకుండా వచ్చి.. ఒక్కసారిగా నా ఎడమ చేయిని కరిచిపట్టుకుంది. ఎలాగొలా కష్టపడి విడిపించుకున్నాను’ అని బాధితుడు వాపోయాడు. ఇదంతా చూసిన అతడి స్నేహితుడు భయంతో ఊరి వైపు పరుగు పెట్టాడు. గ్రామస్థులను గుట్టపై తీసుకొచ్చాడు. వారి రాకను గమనించిన చిరుత అక్కడి నుంచి పారియపోయింది. అయితే.. చిరుత చేసిన గాయానికి వైద్యులు ఏకంగా ఏడు కుట్లు వేయాల్సి వచ్చింది. 


Updated Date - 2020-10-04T02:25:27+05:30 IST