వీధి వ్యాపారులకు రూ.10 వేల రుణం

ABN , First Publish Date - 2020-08-08T08:27:54+05:30 IST

గుర్తింపుకార్డు లేని వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వనిధి) పథకాన్ని కేంద్ర ప్రభు త్వం శుక్రవారం ప్రారంభించింది...

వీధి వ్యాపారులకు రూ.10 వేల రుణం

  • పీఎం స్వనిధిని ప్రారంభించిన కేంద్రం


న్యూఢిల్లీ, ఆగస్టు 7: గుర్తింపుకార్డు లేని వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్‌ నిధి (పీఎం స్వనిధి) పథకాన్ని కేంద్ర ప్రభు త్వం శుక్రవారం ప్రారంభించింది. ఈ పథకం కింద వారికి ‘సిఫారసు ఉత్త రం’ జారీచేస్తారు. ఈ ఉత్తరంతో వీధివ్యాపారులు రూ.10 వేల వరకు రుణం పొందవచ్చని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి దుర్గాశంకర్‌ మిశ్రా తెలిపారు.


అర్హులైన వీధి వ్యాపారులు తాము నివసిస్తున్న ప్రాంతంలోని పట్టణ స్థానిక సంస్థలో ‘సిఫారసు ఉత్తరం’ కోసం ఏదైనా గుర్తింపు పత్రంతో దరఖాస్తు చేస్తే ఆ ఉత్తరాన్ని జారీ చేస్తారని, ఆ ఉత్తరంతో వారు ఏదైనా బ్యాంకు నుంచి రూ.10 వేల వరకు రుణం తీసుకోవచ్చ ని ఆయన చెప్పారు. ఓ సంవత్సరంలో నెలకు వాయిదాల రూపంలో ఈ రు ణాన్ని తిరిగి చెల్లింవచ్చని పేర్కొన్నారు.  


Updated Date - 2020-08-08T08:27:54+05:30 IST