70 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా లీక్... పొంచివున్న హ్యాకర్స్ ముప్పు!

ABN , First Publish Date - 2020-12-10T16:38:46+05:30 IST

70 లక్షల భారతీయ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్ల డేటా... డార్క్ వెబ్‌లో లీక్ అయ్యింది. మీడియాకు ఈ సమాచారాన్ని ఇంటర్నెట్...

70 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డుల డేటా లీక్... పొంచివున్న హ్యాకర్స్ ముప్పు!

న్యూఢిల్లీ: 70 లక్షల భారతీయ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్ల డేటా... డార్క్ వెబ్‌లో లీక్ అయ్యింది. మీడియాకు ఈ సమాచారాన్ని ఇంటర్నెట్ సెక్యూరిటీ రీసెర్చర్ రాజశేఖర్ రజాహరియా తెలిపారు. లీక్ అయిన డిటైల్స్ సైజు 2  జీబీ ఉంది. దానిలో యూజర్స్ పేరు, ఫోను నంబరు, ఈ మెయిల్ ఐడీ, వార్షికాదాయం, కంపెనీ పేరు మొదలైన వివరాలున్నాయి. ఈ కార్డ్ వెబ్‌లో లీక్ అయిన డేటాలో 2010 నుంచి 2019 వరకూ గల వివరాలు ఉన్నాయి.


ఈ డేటాను హ్యాకర్స్ వినియోగించుకునే అవకాశముంది. లీకయిన ఈ సమాచారంతో హ్యాకర్స్... కార్డు హోల్డర్లను మోసగించే ముప్పు ఉంది.  అయితే ఈ లీకయిన డేటాలో డెబిట్, క్రెడిట్ కార్డు నంబరు లీక్ కాలేదు. కాగా ఈ డేటా థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా జరిగినట్లు తెలుస్తోంది. ఈ లీకయిన డేటాలో 50 లక్షల మంది వినియోగదారుల పాన్ నంబర్ కూడా ఉంది. సెక్యూరిటీ యూజర్స్... కొంతమంది వినియోగదారులకు సంబంధించిన డేటాను క్రాస్ చెక్ చేశారు. దీనిలో ఆ సమాచారం నిజమైనదేనని తేలింది. కాగా ఈ డేటా యాక్సిస్ బ్యాంకు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్), కాలింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థల ఉద్యోగులకు సంబంధించినదని తెలుస్తోంది. 


Updated Date - 2020-12-10T16:38:46+05:30 IST