గ్వాటెమాలలో తుపాన్ విపత్తు...150 మంది మృతి

ABN , First Publish Date - 2020-11-07T11:52:16+05:30 IST

శక్తివంతమైన ఈటా తుపాన్ వల్ల కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా 150 మంది మరణించారు....

గ్వాటెమాలలో తుపాన్ విపత్తు...150 మంది మృతి

గ్వాటెమాల: శక్తివంతమైన ఈటా తుపాన్ వల్ల కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా 150 మంది మరణించారు. తుపాన్ వల్ల ఓ గ్రామం మొత్తం బురదనీటిలో కూరుకుపోయిందని అలెజాండ్రో గియామ్మట్టే చెప్పారు.తుపాన్ సహాయచర్యలు ప్రారంభించేందుకు క్యూజా గ్రామంలో సైనికులను రంగంలోకి దించారు.తుపాన్ బీభత్సం వల్ల 150 మంది మరణించారని సైనికవర్గాలు తెలిపాయి.భారీవర్షాల వల్ల బురదజలాలు రోడ్లపై పారాయి.మాయన్ దేశీయ ప్రాంతంలో 2,500 మంది ప్రజలు మట్టిలో తమ వస్తువులను కోల్పోయారు. ఈటా తుపాన్ అమెరికా నుంచి హోండురాస్ మీదుగా క్యూబా వైపు వెళ్లింది. ఈటా తుపాన్ వల్ల వరదలు వెల్లువెత్తడంతో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని యూఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ వెల్లడించింది. 

Updated Date - 2020-11-07T11:52:16+05:30 IST