డీఏ నిలిపివేత అమానుషం: మన్మోహన్‌

ABN , First Publish Date - 2020-04-26T06:50:02+05:30 IST

ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సాయుధ దళాలకు డీఏ నిలిపివేయడం సరికాదని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. శనివారం కన్సల్టేటివ్‌ సమావేశానికి ఆయన నేతృత్వం...

డీఏ నిలిపివేత అమానుషం: మన్మోహన్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, సాయుధ దళాలకు డీఏ నిలిపివేయడం సరికాదని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. శనివారం కన్సల్టేటివ్‌ సమావేశానికి ఆయన నేతృత్వం వహించి మాట్లాడారు. మధ్యతరగతికి ఇవ్వాల్సిన డబ్బును లాక్కుంటున్నారని రాహుల్‌గాంధీ విమర్శించారు. లాక్‌డౌన్‌తో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థ(ఎంఎ్‌సఎంఈ) లు సంక్షోభంలో కూరుకుపోయాయని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. వీటి పునరుజ్జీవం కోసం ప్రభుత్వం రూ.లక్ష కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని, ఇంతే మొత్తంతో క్రెడిట్‌ గ్యారంటీ ఫండ్‌ను నెలకొల్పాలని కోరారు. ఈ మేరకు ప్రధానికి ఆమె లేఖ రాశారు. లాక్‌డౌన్‌ చేయడం, ఆర్థిక వ్యవస్థను లాకౌట్‌ చేయడమన్నది సరైన పరిష్కారం కాదని ఆ పార్టీ నేత కపిల్‌ సిబల్‌ అన్నారు.  


Updated Date - 2020-04-26T06:50:02+05:30 IST