నేడో రేపో ఉద్దీపన ప్యాకేజీ

ABN , First Publish Date - 2020-03-24T09:15:16+05:30 IST

నేడో రేపో ఉద్దీపన ప్యాకేజీ

నేడో రేపో ఉద్దీపన ప్యాకేజీ

న్యూఢిల్లీ, మార్చి 23: కరోనాను ఎదుర్కొనే చర్యల కోసం కేంద్రం త్వరలో భారీ ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ప్రకటించనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలోన్డి కార్యదళం విధివిధానాలను ఖరారు చేస్తోంది. స్టాక్‌ మార్కెట్లు దారుణంగా పతనం కావడంలో పెద్ద ఎత్తున నష్టాలు చవిచూస్తున్నామని, కనీసం రూ.2 లక్షల కోట్ల ఉద్దీపన ఉండాలని పారిశ్రామిక రంగం సూచించినట్లు సమాచారం. వైరస్‌ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రంగాలకు ఈ బెయిలవుట్‌ ప్యాకేజీని ఉద్దేశిస్తారని తెలుస్తోంది.

Read more