ట్విటర్‌లో ట్రెండవుతోంది..ఇది మంచిది కాదు, భారత్‌కు అమెరికా సూచన!

ABN , First Publish Date - 2020-04-08T00:51:45+05:30 IST

దక్షిణాసియా వ్యవహారాలను పర్యవేక్షించే స్టేట్ డిపార్టెమెంట్‌కు దౌత్య వేత్త ఆలిస్ జీ వెల్స్ కూడా స్పందించారు. మైనారిటీలందరిపైనా నింద మోపడం ఆమోదయోగ్యం కాదని, కరోనా కారణం ఉత్పన్నమవుతున్న భయాందోళనలు ప్రజలను విడదీయకూడదని ఆమె ఓ ట్విట్ చేశారు.

ట్విటర్‌లో ట్రెండవుతోంది..ఇది మంచిది కాదు, భారత్‌కు అమెరికా సూచన!

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కట్టడికై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే తబ్లీగీ ఉదంతం తరువాత భారత సోషల్ మీడియాలో ఓ వర్గంపై విమర్శలు ఎక్కువయ్యాయి. ట్విటర్‌లో కరోనా జీహాద్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఈ విషయాంపై అమెరికాకు చెందిన అంతర్జాతీయ మతస్వేఛ్చ కార్యాలయం అధికారి ఒకరు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి ధోరణులకు ప్రభుత్వాలు చెక్ పెట్టాలని సూచించారు. కరోనా మహమ్మారి ప్రబలడానికి మైనారిటీలు కారణం కాదన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలని కోరారు. అయితే దీనిపై తాజాగా.. దక్షిణాసియా వ్యవహారాలను పర్యవేక్షించే స్టేట్ డిపార్టెమెంట్‌కు చెందిన దౌత్యవేత్త ఆలిస్ జీ వెల్స్ కూడా స్పందించారు. మైనారిటీలందరిపైనా నింద మోపడం ఆమోదయోగ్యం కాదని, కరోనా కారణంగా ఉత్పన్నమవుతున్న భయాందోళనలు ప్రజలను విడదీయకూడదని ఆమె ట్విట్ చేశారు. 

Read more