ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసిన రాష్ట్రాలు

ABN , First Publish Date - 2020-07-15T17:11:13+05:30 IST

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసిన రాష్ట్రాలు

వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యే విదేశీ విద్యార్థులకు ఊరట కలిగించేలా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. విదేశీ విద్యార్థుల వీసా రద్దుకు తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆన్ లైన్ క్లాసులపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పలు రాష్ట్రాలు కోర్టులో పిటిషన్ వేశాయి. విచారణ సందర్భంగా వీసా రద్దు నిర్ణయం ఉపసంహరణకు ప్రభుత్వం అంగీకరించింది. 

Updated Date - 2020-07-15T17:11:13+05:30 IST