ఆర్థిక కార్యకలాపాలు పెరగాలి : కేంద్రానికి రాష్ట్రాలు సలహా

ABN , First Publish Date - 2020-05-10T20:06:54+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు రక్షణ చర్యలు అమలు

ఆర్థిక కార్యకలాపాలు పెరగాలి : కేంద్రానికి రాష్ట్రాలు సలహా

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు రక్షణ చర్యలు అమలు చేస్తున్నప్పటికీ, ఆర్థిక కార్యకలాపాలను కూడా క్రమంగా పెంచవలసిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు కేంద్ర ప్రభుత్వానికి ఆదివారం తెలిపారు. 


కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా ఆదివారం అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అష్ట దిగ్బంధనం సమయంలో పరిస్థితులను వీరు వివరించారు. 


రాజీవ్ గౌబా మాట్లాడుతూ భారతీయ రైల్వేలు 350 శ్రామిక్ రైళ్ళను నడుపుతున్నట్లు తెలిపారు. వీటి ద్వారా సుమారు 3.5 లక్షల మంది వలస కూలీలు తమ స్వరాష్ట్రాలకు చేరుకుంటారన్నారు. ఇటువంటి ప్రత్యేక రైళ్ళు మరిన్ని నడిపేందుకు భారతీయ రైల్వేలకు సహకరించాలని రాష్ట్రాలను కోరారు. 


వైద్యులు, వైద్య సిబ్బంది, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. కరోనా యోధులను రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 


Updated Date - 2020-05-10T20:06:54+05:30 IST