కరోనా కారణంగా 2021లో పెరగనున్న ఆకలి చావులు: ఐక్యరాజ్య సమితి
ABN , First Publish Date - 2020-11-21T14:51:37+05:30 IST
కరోనా మహమ్మారి కారణంగా వేలమంది తమ ఉపాధి అవకాశాలను కోల్పోయారు.

న్యూయార్క్: కరోనా మహమ్మారి కారణంగా వేలమంది తమ ఉపాధి అవకాశాలను కోల్పోయారు. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు, అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం ఆర్థికంగా అతలాకుతలమైపోయాయి. ఈ నేపధ్యంలో ఆకలిచావులు మరింతగా పెరిగిపోయాయని విశ్లేషకులు అంటున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లే ఇదే విషయమై మాట్లాడుతూ ప్రపంచం ఆకలి చావులలో చిక్కుకోనుందని, ఇప్పటికైనా ప్రభుత్వాలు అప్రమత్తం కాకపోతే విపరీత పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
కొన్ని దేశాల్లో ఉపశమన ప్యాకేజీలు అందిస్తున్నారని అన్నారు. ఏదిఏమైనప్పటికీ 2021 ఆకలి చావుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ తలకిందులయ్యిందని, చాలామంది ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు కోల్పోయారని ఆవేదనం వ్యక్తం చేశారు. కొన్ని దేశలు తిరిగి లాక్ డౌన్ విధించే దిశగా యోచిస్తుండగా, మరికొన్ని దేశాలు ప్రత్యామ్నాయమర్గాలను అన్వేషిస్తున్నాయని అన్నారు.