ప్రజల మెదళ్లలో తొలుస్తున్న ప్రశ్నలకు మోదీ ఎప్పుడు సమాధానమిస్తారో? స్టాలిన్

ABN , First Publish Date - 2020-04-14T22:57:28+05:30 IST

లాక్‌డౌన్ సందర్భంగా ప్రజల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలకు ప్రధాని మోదీ ఎప్పుడు సమాధానమిస్తారో అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ

ప్రజల మెదళ్లలో తొలుస్తున్న ప్రశ్నలకు మోదీ ఎప్పుడు సమాధానమిస్తారో? స్టాలిన్

చెన్నై : లాక్‌డౌన్ సందర్భంగా ప్రజల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలకు ప్రధాని మోదీ ఎప్పుడు సమాధానమిస్తారో అని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రశ్నించారు. ప్రధాని మోదీ నుంచి ఉపశమన చర్యలను, ఆర్థిక ప్యాకేజీని ప్రజలు ఆశించారని, అంతే తప్ప సలహాలను ఆశించలేదని విమర్శించారు. ఆర్థిక పరమైన ప్యాకేజీలను మోదీ తన మొదటి ప్రసంగంలోనూ ప్రకటించలేదని, లాక్‌డౌన్‌పై తాజాగా చేసిన ప్రసంగంలోనూ ప్రకటించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుల స్థానిక సంస్థల అభివృద్ధి నిధుల్లో కోత, తమిళనాడు ప్రభుత్వం నిధులు కావాలంటూ కేంద్రాన్ని అడిగితే స్పందించకపోవడం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సరైంది కాదని స్టాలిన్ విమర్శించారు. 


Updated Date - 2020-04-14T22:57:28+05:30 IST