కరోనా ఎఫెక్ట్ : శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు వాయిదా

ABN , First Publish Date - 2020-04-21T17:08:55+05:30 IST

కరోనా వైరస్ శ్రీలంక ఎన్నికలపై ప్రభావం చూపించింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రెండు నెలలపాటు శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు...

కరోనా ఎఫెక్ట్ :  శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు వాయిదా

కొలోంబో (శ్రీలంక): కరోనా వైరస్ శ్రీలంక ఎన్నికలపై ప్రభావం చూపించింది. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో రెండు నెలలపాటు శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఆ దేశ ఎన్నికల కమిషన్ ప్రకటించింది. శ్రీలంక దేశంలో 295 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఏడుగురు కరోనా వల్ల మరణించారు. ఈ నెల 25వతేదీన జరగాల్సిన శ్రీలంక పార్లమెంటు ఎన్నికలు జూన్ 20వరకు వాయిదా వేస్తున్నట్లు కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే మార్చి 20వతేదీన పార్లమెంటును రద్దు చేసిన విషయం పాఠకులకు విదితమే. 

Updated Date - 2020-04-21T17:08:55+05:30 IST