హాట్‌స్టార్ల.. స్పాట్‌ ‘లైట్‌’!!

ABN , First Publish Date - 2020-10-13T08:06:21+05:30 IST

ఈ ఫొటోలో కనిపిస్తున్నది సాధారణ కాంతి కాదు!! భగభగ మండిపోయే భానుడి కంటే శక్తివంతమైన వూల్ఫ్‌ రాయెట్‌ రకానికి చెందిన రెండు నక్షత్రాలు ఒక దాని చుట్టూ ఒకటి వేగంగా తిరగడంతో వెలువడిన కాంతి, కార్బన్‌తో కూడిన దుమ్ముధూళి కణాలు, వాయువులు కలగలిసి ఈ రూపును సంతరించుకున్నాయి...

హాట్‌స్టార్ల.. స్పాట్‌ ‘లైట్‌’!!

  • నక్షత్ర మండలంలో.. వూల్ఫ్‌ రాయెట్‌ రకపు రెండు నక్షత్రాల సయ్యాట


సిడ్నీ, అక్టోబరు 12 : ఈ ఫొటోలో కనిపిస్తున్నది సాధారణ కాంతి కాదు!! భగభగ మండిపోయే భానుడి కంటే శక్తివంతమైన వూల్ఫ్‌ రాయెట్‌ రకానికి చెందిన రెండు నక్షత్రాలు ఒక దాని చుట్టూ ఒకటి వేగంగా తిరగడంతో వెలువడిన కాంతి, కార్బన్‌తో కూడిన దుమ్ముధూళి కణాలు, వాయువులు కలగలిసి ఈ రూపును సంతరించుకున్నాయి. చిలీలోని దక్షిణ ఐరోపా అబ్జర్వేటరీలో ఉన్న భారీ టెలిస్కో్‌పను ఉపయోగించి హై రెజెల్యూషన్‌ ఇమేజింగ్‌ టెక్నిక్‌తో నక్షత్ర మండలంలో చోటుచేసుకున్న ఈ అరుదైన పరిణామపు దృశ్యాలను సిడ్నీ వర్సిటీ శాస్త్రవేత్తలు బంధించారు.


భూమికి 8వేల కాంతి సంవత్సరాల దూరంలోని ‘నార్మా’ అనే నక్షత్ర మండలంలో ఈ రెండు నక్షత్రాల సయ్యాట చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ఈక్రమంలో వెలువడిన వాయువులు, దుమ్ముధూళి.. ఈజిప్షియన్‌ దేవత ‘ఎపెప్‌’ను తలపించేలా మెలికలు తిరిగిన పాములా ఆకృతి దాల్చాయి. దీంతో వాటికి ‘ఎపెప్‌’ అనే పేరుపెట్టారు. వూల్ఫ్‌ రాయెట్‌ నక్షత్రాలు ఈరకంగా ప్రతి 125 ఏళ్లకోసారి ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతాయని చెప్పారు. ఈ ఒక్కో నక్షత్రం పరిమాణం సూర్యుడి కం టే 15 రెట్లు పెద్దదిగా ఉంటుందన్నారు. ఇక సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత 5,600 డిగ్రీల సెల్సీయస్‌ ఉండ గా.. వూల్ఫ్‌ రాయెట్‌ నక్షత్ర ఉపరితల ఉష్ణోగ్రత 25 వేల డిగ్రీల సెల్సీయస్‌ కంటే ఎక్కువేనని పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-13T08:06:21+05:30 IST