దేశంలో 27 ల‌క్ష‌ల‌కు చేరిన క‌రోనా బాధితులు

ABN , First Publish Date - 2020-08-18T16:59:34+05:30 IST

గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. దేశంలో కొత్తగా 55,078 క‌రోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య‌ 27 లక్షలను దాటింది.

దేశంలో 27 ల‌క్ష‌ల‌కు చేరిన క‌రోనా బాధితులు

న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. దేశంలో కొత్తగా 55,078 క‌రోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య‌ 27 లక్షలను దాటింది. క‌రోనా నుంచి కోలుకున్న‌ వారి సంఖ్య పంతొమ్మిదిన్న‌ర ల‌క్ష‌ల‌ను దాటింది. తాజా గణాంకాల ప్రకారం గడ‌చిన‌ 24 గంటల్లో క‌రోనాతో 876 మంది మృతి చెంద‌డంతో, మొత్తం మరణాల సంఖ్య 51,797 కు పెరిగింది. దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 27,02,742కు చేరింది. వీరిలో 6,73,166 మంది చికిత్స పొందుతుండ‌గా, చికిత్స అనంత‌రం 19,77,779 మంది కోలుకున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టు 17 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 3,09,41,264 నమూనాలను పరీక్షించగా, అందులో సోమవారం ఒక్క రోజులో అత్య‌ధికంగా 8,99,864 నమూనాలను పరీక్షించారు.Updated Date - 2020-08-18T16:59:34+05:30 IST