ప్రత్యేకంగా కొవిడ్‌-19 ఆస్పత్రి

ABN , First Publish Date - 2020-03-24T09:35:23+05:30 IST

కరోనాపై పోరులో మేము సైతం అంటూ ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ముందుకొచ్చింది. కొవిడ్‌-19 రోగుల కోసం ప్రత్యేకంగా దేశంలోనే ...

ప్రత్యేకంగా కొవిడ్‌-19 ఆస్పత్రి

రోజుకు లక్ష మాస్కుల ఉత్పత్తి: ముకేశ్‌ అంబానీ  


న్యూఢిల్లీ, మార్చి 23: కరోనాపై పోరులో మేము సైతం అంటూ ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ముందుకొచ్చింది. కొవిడ్‌-19 రోగుల కోసం ప్రత్యేకంగా దేశంలోనే తొలి ఆస్పత్రిని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. బృహన్‌ ముంబై మునిసి పల్‌ కార్పొరేషన్‌ సహకారంతో ముంబైలోని సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రిలో 100 పడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రిని రెండు వారాల్లోనే సిద్ధం చేశామని ముకేశ్‌ అంబానీ తెలిపారు.


అలాగే మహారాష్ట్రలోని లోధివాలిలో ఐసోలేషన్‌ కేంద్రాన్ని ప్రభుత్వానికి అందజేశామన్నారు. వైరస్‌కు మందును కనుగొ నేందుకు రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌కు చెందిన వైద్యులు, పరిశోధకులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి రూ.5 కోట్లు విరాళంగా అందజేసినట్లు వెల్లడించారు. ఇక రోజుకు లక్ష మాస్కులను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్య సిబ్బందికి దుస్తులు, సూట్లు, మాస్కులు వంటి వాటిని కూడా సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.

Updated Date - 2020-03-24T09:35:23+05:30 IST